Tuesday, June 16, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅరెస్టుపై కోర్టును ఆశ్రయించిన గొటబయ రాజపక్స

అరెస్టుపై కోర్టును ఆశ్రయించిన గొటబయ రాజపక్స

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: అరెస్టుపై శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్సే కోర్టును ఆశ్రయించారు. తన అరెస్టును అడ్డుకోవాలంటూ రాజపక్సే మంగళవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్పీల్ కోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ లో పోలీస్ చీఫ్, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్ (సిఐడి) డైరెక్టర్, ఆఫీస్ ఇన్ చార్జ్ లను ప్రతివాదులుగా చేర్చారు. ఉగ్రవాద నిరోధక చట్టం (పిటిఎ) కింద రాజపక్సను అరెస్టు చేసే అవకాశం ఉందని ఆయన తరపున న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. 2019లో రాజపక్స అధ్యక్ష పదవిని గెలుచుకోవడానికి సహాయపడేందుకు, ఈస్టర్ సండే దాడులను జరిపిన నేషనల్ తౌహీత్ జమాత్ (ఎన్ టి జె)కు ఆశ్రయం కల్పించి, వారితో సంబంధాలు కొనసాగించడం ద్వారా నిఘా చీఫ్ సురేష్ సల్లే ఈ దాడులను ప్లాన్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. 2019 ఏప్రిల్ 21న మూడు చర్చిలు, లగ్జరీ హోటల్స్ లో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 44 మంది విదేశీయులు (వారిలో 11 మంది భారతీయులు) సహా 270 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 500 మందికి పైగా గాయపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -