Tuesday, June 16, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఉక్రెయిన్‌, పశ్చిమాసియా అంశాలపై జీ7 శిఖరాగ్ర చర్చలు

ఉక్రెయిన్‌, పశ్చిమాసియా అంశాలపై జీ7 శిఖరాగ్ర చర్చలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: మంగళవారం ఫ్రాన్స్‌ అధ్యక్షతన జి7 సదస్సు జరగనుంది. ఈ శిఖరాగ్ర సమావేశానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, బ్రిటన్‌ ‌ప్రధాని కీర్‌ ‌స్టార్మర్‌, కెనడా ప్రధాని మార్క్‌ ‌కార్నీ, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్లు పాల్గొన్నారు.

కాగా, ఈ సమావేశం జూన్‌ 15- 17 ‌వరకు జరగనుంది. ఫ్రాన్స్‌లోని ఎవియాన్-లెస్-బైన్స్ అనే స్పా పట్టణంలో మంగళవారం పశ్చిమాసియా ఘర్షణలు, రష్యా – ఉక్రెయిన్‌ ‌యుద్ధంపై చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ చర్చలలో ఈజిప్ట్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకులు పాల్గొననున్నారు. ప్రధాని మోడీ కూడా ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఎవియాన్‌ ‌నగరానికి చేరుకున్నారు. ఈ జి7 సదస్సు సందర్భంగా మోడీ ట్రంప్‌‌తో భేటీ అయ్యే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -