నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని డోన్గావ్ గ్రామ సర్పంచ్ ఖానాపురే శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం నాడు ఎంపిపిఎస్ శక్తి నగర్ పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడిందని ప్రధాన ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ చిన్నారులకు నోట్‌బుక్స్ అందజేసి వారి విద్యా ప్రగతికి ప్రోత్సాహం అందించడం ఎంతో ఆనందంగా అనిపించిందని అన్నారు. నేటి విద్యార్థులే రేపటి భారతదేశ భవిష్యత్తు పౌరులని తెలిపారు . ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వారు కష్టపడి చదివి ఉన్నత విద్యను అభ్యసించి సమాజానికి ఆదర్శప్రాయులుగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నాము. అందరు విద్యార్థులు విద్యలో రాణించి, తమ తల్లిదండ్రులకు, గ్రామానికి మరియు దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ వారి ఉజ్వల భవిష్యత్తుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు.
విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



