Tuesday, June 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్23వ సారి ఏకగ్రీవంగా ఎన్నికైన బత్తుల నరేందర్ రెడ్డి

23వ సారి ఏకగ్రీవంగా ఎన్నికైన బత్తుల నరేందర్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం శారాజీపేట గ్రామానికి చెందిన నల్లగొండ–రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘం అధ్యక్షుడిగా బత్తుల నరేందర్ రెడ్డి వరుసగా 23వ సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే నూతన డైరెక్టర్లుగా పుట్టల మహేందర్,సిరబోయిన యాకయ్య ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా  నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు,డైరెక్టర్లను శారాజీపేట సర్పంచ్ కంతి మధు శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.పాల ఉత్పత్తిదారుల సంక్షేమం కోసం నరేందర్ రెడ్డి గతంలో చేసిన సేవలను కొనియాడుతూ,ఆయన నాయకత్వంలో సంఘం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.నూతనంగా ఎన్నికైన బత్తుల నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తనపై మరోసారి నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న పాల ఉత్పత్తిదారులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.పాల రైతుల సంక్షేమం,సంఘం అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పాల ఉత్పత్తిదారులు,సంఘ సభ్యులు,ప్రజాప్రతినిధులు పాల్గొని నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు, డైరెక్టర్లకు అభినందనలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -