నవతెలంగాణ-ఆలేరు టౌను
ఆరోగ్యవంతమైన ఓటరు జాబితా కోసం చేసే ప్రయత్నమే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని తహశీల్దార్ వి ఆంజనేయులు అన్నారు. ఆలేరు పట్టణంలో మంగళవారం బాలికల ఉన్నత పాఠశాలలో ఎస్ ఐ ఆర్ శిక్షణలో భాగంగా.. మండలంలోని బూత్ లెవెల్ ఆఫీసర్ల ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. భారత ఎన్నికల సంఘం చేపట్టే ఒక విధమైన ప్రక్రియ ఎస్ ఆర్ అని, దీని ద్వారా అర్హులైన భారత పౌరులందరూ ఓటర్ల జాబితా (ఇ ఆర్ )లో చేర్చబడతారని, అనర్హులైన ఓటర్లు ఎవరూ ఓటర్ల జాబితాలో చేర్చబడరని నిర్ధారించుకుంటారని అన్నారు.
ఈ ఎస్ ఐ ఆర్ ద్వారా ఓటర్ల జాబితా ఫ్యూరిఫికేషన్ జరుగుతుందని, డెత్, డబుల్ ఉన్న ఓటర్ల ను గుర్తించి సరిచేయడం జరుగుతుందని, తద్వారా సరియైన ఓటర్ల జాబితా తయారవుతుందని తెలిపారు. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కు సంబందించిన షెడ్యూల్ వెలువడిందని, బిఎల్వీఓ లు అందరూ ఈ నెల 25 నుండి ఇంటింటికి తిరిగి ఎన్యుమరేషన్ ఫారములు ఇస్తారని, ఓటర్లు ఆ ఫారాలను నింపి తిరిగి బి ఎల్ ఓ లకు ఇవ్వాలని, ఫారాలను నింపే విషయంలో బి ఎల్ ఓ లు సహకరిస్తారని అన్నారు. ఈ విషయంలో రాజకీయపక్షాలకు కూడా అవగాహన కల్పించామని, ఓటర్లందరూ సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎన్నికల శిక్షణాధికారులు హరనాథ్ రెడ్డి, దూడల వెంకటేష్, తిరుపతి రెడ్డి చితరంజన్, ఆర్ ఐ లు పూర్ణచందర్ రావు, భద్రయ్య, ఏ ఎస్ ఓ మహేష్, కార్యాలయ సిబ్బంది రాజేష్, శ్రీకాంత్, భాస్కర్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.



