Tuesday, June 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు: ఏఓ రాజు

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు: ఏఓ రాజు

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్ 
మద్నూర్ మండల పరిధిలోని ఫర్టిలైజర్ షాపులను మంగళవారం మండల వ్యవసాయ అధికారి రాజు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..రైతులకు నాణ్యమైన విత్తనాలనే విక్రయించాలని సూచించారు. అమ్మిన ప్రతి దానికి విధిగా రశీదు ఇవ్వాలన్నారు. అదేవిధంగా దుకాణానికి వచ్చిన స్టాక్ కు సంబంధించి, స్టాక్ బోర్డు, ఇన్వాయిస్ తప్పక ఉండాలని చెప్పారు. ఎరువులు, మందులను రైతులకు ఎమ్మార్పీ రేటుకే విక్రయించాలని, అధిక నగదు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలతో పాటు దుకాణ లైసెన్సును రద్దు చేస్తామని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -