- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ వాసులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త అందించింది. నగరంలో 37 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే నగరానికి చేరుకున్న ఈ బస్సులు, డ్రైవర్ల కొరత కారణంగా సేవలు ప్రారంభించడంలో ఆలస్యం జరుగుతోంది. ఎలక్ట్రిక్ బస్సులు నడపడానికి అర్హత కలిగిన డ్రైవర్ల నియామకానికి మెడికల్, డ్రైవింగ్ సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అర్హత సాధించిన వారికి ప్రత్యేక ట్రయల్ రన్ తర్వాత బాధ్యతలు అప్పగిస్తారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతోంది.
- Advertisement -



