- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మొహర్రం పండగ సందర్భంగా జూన్ 26న కేంద్ర ప్రభుత్వం గెజిటెడ్ పబ్లిక్ హాలిడే ప్రకటించింది. చంద్రదర్శనంలో తేడాల కారణంగా గల్ఫ్ దేశాలు, భారత్‌లో తేదీలు వేరుగా ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా ఆషూరా దినోత్సవాన్ని జూన్ 26న నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పోస్టాఫీసులు, స్టాక్ ఎక్స్ఛేంజీలకు సెలవు ఉండనుంది. శుక్రవారం సెలవుతో పాటు శని, ఆదివారాలు కలవడంతో ఉద్యోగులకు మూడు రోజుల లాంగ్ వీకెండ్ లభించనుంది.
- Advertisement -



