Wednesday, June 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఎమ్మెల్యే పల్లవి బిడ్డకు నామకరణం చేసిన సీఎం విజయ్‌

ఎమ్మెల్యే పల్లవి బిడ్డకు నామకరణం చేసిన సీఎం విజయ్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళనాడు రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. తిరు.వి.క.నగర్‌ ఎమ్మెల్యే పల్లవి చంటిబిడ్డకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్‌ విజయ్‌ నామకరణం చేశారు. నిన్న శాసనసభ కార్యక్రమాలు ముగించుకుని సచివాలయం నుంచి ఇంటికి బయలుదేరుతున్న విజయ్‌ను పల్లవి తన చంటిబిడ్డను తీసుకుని ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం విజయ్‌కు ఆమె జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు, తన బిడ్డకు నామకరణం చేయాల్సిందిగా కోరారు.

ఎమ్మెల్యే విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి విజయ్.. పసిబిడ్డను ఎంతో ఆప్యాయంగా తన చేతుల్లోకి తీసుకుని ‘తమిళ్‌ వెట్రి కొండాన్‌’ అని పేరు పెట్టారు. ఈ విషయమై పల్లవి మీడియాతో మాట్లాడుతూ… గతంలో విజయ్ నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘జననాయగన్‌’లో ఆయన క్యారెక్టర్ పేరు ‘వెట్రి కొండాన్‌’ అని, దానికి ‘తమిళ్’ జోడించి ముఖ్యమంత్రి తన బిడ్డకు ఈ పేరు పెట్టారని ఆనందం వ్యక్తం చేశారు. ఇకపై తన బిడ్డను షార్ట్ ఫామ్‌లో ‘టీవీకే’ అని పిలుచుకుంటామని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -