Wednesday, June 24, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాన్‌పై అమెరికా యుద్ధం..సెనేట్ కీలక తీర్మానం

ఇరాన్‌పై అమెరికా యుద్ధం..సెనేట్ కీలక తీర్మానం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యను నిలిపివేయాలని కోరుతూ అమెరికా సెనేట్ కీలక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానం 50-48 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఏకపక్షంగా సైనిక చర్యలు చేపట్టకుండా నియంత్రించడమే ఈ తీర్మానం ప్రధాన ఉద్దేశంగా పేర్కొనబడింది. ఈ నెల ప్రారంభంలో యుఎస్ ప్రతినిధుల సభ ఆమోదించిన యుద్ధ అధికారాల తీర్మానానికి తాజాగా సెనేట్ కూడా మద్దతు తెలిపింది. ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్ పార్టీకి చెందిన నలుగురు సెనేటర్లు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. ఒక డెమోక్రాట్ సభ్యుడు మినహా మిగిలిన వారంతా తీర్మానానికి మద్దతు తెలిపారు. మరో ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్లు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. యుద్ధ క్షేత్రం నుండి అమెరికా సైనిక బలగాలను ఉపసంహరించుకోవాలని అధ్యక్షుడిని ఆదేశిస్తూ కాంగ్రెస్ ఉభయ సభలు ఒక తీర్మానాన్ని ఆమోదించడం ఇదే మొదటిసారి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -