Wednesday, June 24, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంజూలై 5న ఖమేనీ అంత్యక్రియలు

జూలై 5న ఖమేనీ అంత్యక్రియలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: సుప్రీం లీడర్‌ అయతోల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని నరేంద్రమోడీని ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఆహ్వానించారు. అయతోల్లా ఖమేనీ అంత్యక్రియలు జూలై 5 నుంచి 9 వరకు జరగనున్నాయి. ఖమేనీ చివరి వీడ్కోలుకు మంగళవారం మోడీకి ఆహ్వానం లభించిందని, అయితే దీనిపై భారత్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు మీడియా వర్గాలు తెలిపాయి.

కాగా, అమెరికా – ఇజ్రాయిల్‌ ‌దాడిలో ఫిబ్రవరి 28న ఇరాన్‌ ‌సుప్రీం లీడర్‌ అయతోల్లా అలీ ఖమేనీ, ఆయన కుమార్తె, అల్లుడు, మనవడు మృతి చెందారు. ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం మరణించిన వారిని 24 గంటల లోపు ఖననం చేయాల్సి ఉన్నప్పటికీ, పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా ఖమేనీ అంత్యక్రియలు పలుమార్లు వాయిదా పడ్డాయి అని ఇరాన్‌ ‌పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -