నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లా, బిలౌతి గ్రామానికి చెందిన 28 ఏళ్ల విద్యార్థి, భరత్ భూషణ్ తివారీ, ఇటీవల జూన్ 17న పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఈ ఎన్‌కౌంటర్ పై బీహార్ వ్యాప్తంగా విమర్శలు వెలువెత్తుతున్నాయి. రోజురోజుకు తివారి ఎన్ కౌంటర్ ను వ్యతిరేకిస్తు ఆందోళనలు మిన్నంటాయి. తాజాగా జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కుమార్ భరత్ భూషన్ తివారి కుటుంబాన్ని కలిశారు. స్వయంగా బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి పరామర్శించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. భరత్ కుమార్ ఎన్ కౌంటర్ పై జ్యూడిషియల్ ఎంక్వైరీ చేపట్టాలని, ఆకారణంగా చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటన వెనుక అందర్ని జోక్యం ఉందని, పారదర్శకంగా విచారణ చేపట్టి అసలు నేరస్తులను తొందరగా శిక్షించాలన్నారు. ఇదిలా ఉండగా, భరత్ భూషణ్ తివారీ ఎన్‌కౌంటర్ ఆరోపణలపై జగదీష్‌పూర్ డీఎస్పీ, షాహ్‌పూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO), ఇతర సహాయక పోలీసు సిబ్బందిపై బీహార్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తివారీ తల్లి భోజ్‌పూర్ ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో, షాహ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
భరత్ భూషణ్ తివారీ కుటుంబానికి ప్రశాంత్ కిశోర్ పరామర్శ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



