- Advertisement -
నవతెలంగాణ-సదాశివనగర్: సదాశివనగర్ గ్రామానికి చెందిన గంగొల్ల మల్లయ్య అనారోగ్యంతో మూడు రోజుల క్రితం మరణించారు. నిరుపేద కుటుంబం కావడంతో కురుమ కులస్తులందరూ చందాలు చేసి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషయం తెలిసిన సదాశివనగర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు నల్ల మైపాల్ రెడ్డి తన వంతు సహాయంగా బుధవారం మృతుని భార్య గంగోల్ల లక్ష్మి కి 2000/-రూపాయలు అందించారు. ఈ కార్యక్రమంలో సదాశివ నగర్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు జగ్గా బాలరాజ్ ,మాజీ విడిసి చైర్మన్ జనగామ రాజు కురుమ, జోగిని ఎల్లయ్య వార్డు మెంబర్ మ్యాదరి పద్మ వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
- Advertisement -



