- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
నారాయణఖేడ్ పట్టణంలో మున్సిపల్ చైర్మన్ నగేష్ షెట్కర్ నూతన ఎన్ఎస్ఎం మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన వ్యాపార సంస్థ మరింత అభివృద్ధి చెందాలని, ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్, నారాయణఖేడ్ శాసనసభ్యులు డా. సంజీవ్ రెడ్డి , ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
- Advertisement -



