Saturday, June 27, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణకు తీవ్ర నష్టం కలిగించేలా..ముగ్గురు సీఎంలు చీకటి ఒప్పందాలు

తెలంగాణకు తీవ్ర నష్టం కలిగించేలా..ముగ్గురు సీఎంలు చీకటి ఒప్పందాలు

- Advertisement -
  • మాజీ మంత్రి హరీష్ రావు

నవతెలంగాణ-హైదరాబాద్: ఇటీవల కర్ణాటకలో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన చీకటి ఒప్పందాలు ఏంటని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు ప్రశ్నించారు. కర్ణాటకలో మూడు రాష్ట్రాల సీఎంలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను కూడా లోపలికి రానీయకుండా నలుగురే కూర్చుని ఏం ఒప్పందాలు చేసుకున్నారో సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణకు తీవ్ర నష్టం కలిగించేలా కర్ణాటకలో నవేలి, ఏపీలో గుండ్రేవుల ప్రాజెక్టులు కడతామంటుంటే మన ముఖ్యమంత్రి చారిత్రక ఒప్పందం అంటూ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. గతంలో గుండ్రేవులకు నీళ్లు ఇవ్వబోమని ట్రిబ్యునల్ చెప్తే, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాన్ని రానీయకుండా అడ్డుకున్నామని, కానీ ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి తన శిష్యుడైన తెలంగాణలో సీఎం అయ్యాడనే ధీమాతో మళ్లీ ఆ ప్రాజెక్టును ముందుకు తెచ్చారని ఆరోపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -