Saturday, June 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పల్స్ పోలియోని విజయవంతం చేయాలి

పల్స్ పోలియోని విజయవంతం చేయాలి

- Advertisement -

మండలవైద్యాధి అధికారి డాక్టర్ ఉమాకాంత్ 
నవతెలంగాణ – పెద్దకొడప్ గల్ 

ఈనెల 28న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని  డాక్టర్ ఉమాకాంత్ కోరారు. శనివారం మండలంలోని  ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనమాట్లాడారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల గ్రామాలలో కేంద్రాలను ఏర్పాటు చేసి పుట్టిన నుండి ఐదు సంవత్సరాలలో పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయిస్తామని తెలిపారు.

అందుకు అవసరమైన ఏర్పాట్లు అన్నింటిని ఇప్పటికే పూర్తి చేసినట్లు వివరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 10పోలియో చుక్కల కేంద్రాలు,అదేవిధంగా ఒక మొబైల్ బృందం ఏర్పాటు చేశామని  తెలిపారు. ఆదివారం రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు పిల్లలకు పోలియో చుక్కలు వేస్తామన్నారు. ఆరోజు హాజరు కాని పిల్లలకు సోమవారం రోజు ఇంటింటికి తిరిగి మా సిబ్బంది పోలియో చుక్కలు వేస్తారని డాక్టర్ ఉమాకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, వాలంటీర్లు పాల్గొని చిన్నారులకు చుక్కల మందును వేస్తారన్నారు. మండలంలోని ప్రజలందరూ ఆదివారం రోజు తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని, తద్వారా శిశు పక్షవాతాన్ని నివారించవచ్చునని అవకాశం ఉందని తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -