- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలం కొయ్యుర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు గ్రామీణ వైద్యుడు దేవి భూమయ్య,గ్రామ ఉపసర్పంచ్ లకావత్ సవేందర్, వార్డు సభ్యులు లకావత్ లక్ష్మీ-తిరుపతి, మందారపు రవళి-ప్రశాంత్, పంతకాని శశిలు శనివారం నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఉపసర్పంచ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలోనే తల్లిదండ్రులు వారి పిల్లలను చేర్పించాలని కోరారు. నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు, నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడం జరుగుతుందని తెలిపారు.
- Advertisement -



