Saturday, June 27, 2026
E-PAPER
Homeఆదిలాబాద్తపాలా సేవలపై అవగాహన

తపాలా సేవలపై అవగాహన

- Advertisement -

నవతెలంగాణ-బజార్ హత్నూర్
మండల కేంద్రంలోని తపాలా కార్యాలయంలో శనివారం తపాలా శాఖ ఆధ్వర్యంలో తపాలా సేవలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ పరచ సాయన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (బీపీఎం) భాగ్యశ్రీ మాట్లాడుతూ భారత తపాలా శాఖ ప్రజలకు అందిస్తున్న వివిధ సేవలను వివరించారు. పొదుపు పథకాలు, జీవిత బీమా, ప్రమాద బీమా, పోస్టాఫీస్ బ్యాంకింగ్ సేవలు, ఇన్సూరెన్స్ పథకాలు, బాలికల భవిష్యత్తు కోసం అమలు చేస్తున్న సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రభుత్వం అందిస్తున్న తపాలా సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, పొదుపు అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తపాలా శాఖ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -