Saturday, June 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పట్టీలు లేకుండా రోడ్లపై ట్రాక్టర్లు నడిపితే చర్యలు: ఎస్ఐ

పట్టీలు లేకుండా రోడ్లపై ట్రాక్టర్లు నడిపితే చర్యలు: ఎస్ఐ

- Advertisement -

నవతెలంగాణ – దర్పల్లి
కేజ్ విల్ ట్రాక్టర్లు పట్టిలు లేకుండా రోడ్లపై ట్రాక్టర్లు నడిపిన వారిపై చట్టప్రకారం కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ సందీప్ తెలిపారు. శనివారం ఆయన ఓప్రకటన విడుదల చేస్తూ, మండలంలోని అన్ని గ్రామాల ట్రాక్టర్ యజమానులకు, డ్రైవర్ లు తమ వాహనాలు వ్యవసాయ పనుల నిమిత్తం కేజ్ విల్ పెట్టి రోడ్లపై కి వచ్చేటప్పుడు జాగ్రత్తలు వహించాలని సూచించారు. కేజ్ విల్ లకు పట్టిలు ఏర్పాటు చేసుకొని రోడపైకి వాహనాలు తేవాలని కోరారు. లేనియెడల, విలువైన రహదారుల ప్రభుత్వ సంపద దుర్వినియోగం జరిగి, తిరిగి రహదారులు వర్షాలకు చెడిపోయి ప్రజలకే ఇబ్బందులు కలుగుతాయని కోరారు.

ప్రజలకు తెలియజేయునది ఏమనగా, కేజీ వీల్ ట్రాక్టర్లను పట్టీలు లేకుండా ప్రజా రహదారులపై నడపడం వలన రోడ్లు దెబ్బతినడంతో పాటు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కాబట్టి ట్రాక్టర్ యజమానులు మరియు డ్రైవర్లు కేజీ వీల్ ట్రాక్టర్లకు తప్పనిసరిగా పట్టీలు అమర్చి మాత్రమే రహదారులపై నడపవలెను. పట్టీలు లేకుండా ట్రాక్టర్లను నడిపిన వారిపై చట్టము ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోబడతాయి. అందరూ నిబంధనలను పాటించి రహదారి భద్రతకు సహకరించాలని కోరుతున్నాము.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -