Sunday, June 28, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంసీషెల్స్‌ మా క్లోజ్ ఫ్రెండ్

సీషెల్స్‌ మా క్లోజ్ ఫ్రెండ్

- Advertisement -


విలువైన సముద్ర భాగస్వామి: ప్రధాని మోడీ
విక్టోరియా :
సీషెల్స్‌ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోడీకి ఘనస్వాగతం లభించింది. సీషెల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ దేశ అధ్యక్షుడు హెర్మినియా ప్రధానికి స్వాగతం పలికారు. అధికారిక గౌరవ వందనం కూడా స్వీకరించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ, సీషెల్స్‌ అధ్యక్షుడు హెర్మినియాతో ద్వైపాక్షిక చర్చలు జరపటంతోపాటు జాతీయ దినోత్సవాల్లో గౌరవ అతిథిగా పాల్గొంటారు. సముద్ర భద్రత, రక్షణ, ఆరోగ్యం, విద్య, వాతావరణ మార్పులు, సుస్థిర అభివృద్ధి వంటి కీలక రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇరువురు నేతలు దృష్టి సారించనున్నారు. ప్రధాని మోడీ సీషెల్స్ జాతీయ అసెంబ్లీలో ప్రసంగించడమే కాకుండా ప్రవాస భారతీయులతో ముచ్చటించనున్నారు. ప్రధాని మోడీ పర్యటన భారత్‌-సీషెల్స్ మధ్య 1976 నుంచి ఉన్న దశాబ్దాల నాటి స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని సీషెల్స్ అధ్యక్ష కార్యాలయం పేర్కొంది.
అటు సీషెల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన తర్వాత ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా పెంపొందించే లక్ష్యంతో ఈ పర్యటన అత్యంత ఫలవంతంగా ఉంటుందని తాను ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. సీషెల్స్‌ను విలువైన సముద్ర భాగస్వామిగా, హిందూ మహాసముద్రంలో ఒక సన్నిహిత మిత్రదేశంగా అభివర్ణించారు. ఈ మేరకు సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మిని అందించిన ఘన స్వాగతాన్ని ప్రశంసించారు. తనకు స్వాగతం పలకడానికి తరలివచ్చిన ప్రవాస భారతీయులకు ప్రగాఢ కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -