Sunday, June 28, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఎవరి గోల వారిదే..!

ఎవరి గోల వారిదే..!

- Advertisement -

ఇరాన్, ఇజ్రాయిల్ విషయాలపై వాన్స్, రూబియోల భిన్న స్వరాలు
శాంతి ప్రయత్నాలను ఇజ్రాయిల్ దెబ్బతీస్తోందని సూచన
ఆత్మరక్షణ చేసుకునే హక్కు ఇజ్రాయిల్‌కు ఉంది : రూబియో
మనామా :
ఇరాన్ యుద్ధంపై ఐక్యంగా ఉన్నామని చాటి చెప్పడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. కానీ ఇజ్రాయిల్ విషయంలో యూఎస్ ఉపాధ్యక్షుడు, విదేశాంగ కార్యదర్శి చేసిన ప్రకటనలు పలుమార్లు విభిన్నంగా ఉంటున్నాయి. గత వారం వైట్ హౌస్‌లో మాట్లాడుతూ, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అమెరికా-ఇరాన్ ప్రాథమిక ఒప్పందాన్ని విమర్శిస్తున్న ఇజ్రాయిల్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇజ్రాయిల్‌పై దాడులు చేస్తున్న హిజ్బుల్లాను బలహీనపరిచే ఉద్దేశంతో బీరుట్‌లోని పౌర మౌలిక సదుపాయాలపై ఇజ్రాయిల్ జరిపిన బాంబు దాడులు, అమెరికా నేతృత్వం లోని శాంతి ప్రయత్నాలను దెబ్బతీస్తున్నాయని ఆయన చెప్పారు. తాజాగా ఈ వారం గల్ఫ్ ప్రాంతంలో పర్యటించిన విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, లెబనాన్‌లో ఇజ్రాయిల్ సైనిక చర్యను సమర్థించారు. హిజ్బుల్లా దాడులకు ఇజ్రాయిల్ తీసుకున్న చర్యలు సమర్థనీయమైన ప్రతిస్పందన అని ఆయన పదేపదే పేర్కొన్నారు. వాన్స్ విమర్శల గురించి ప్రశ్నించగా, రూబియో ఆ విషయాన్ని దాటవేసి, ఈ వారం మొదట్లో లెబనాన్‌కు చెందిన మిలీషియా ఒక ఇజ్రాయిల్ చెక్‌పాయింట్‌పై జరిపిన దాడి గురించి వివరించారు.

ప్రభుత్వం ఐక్యతను నొక్కి చెబుతున్నప్పటికీ, భిన్న మైన ప్రపంచ దృక్పథాలు అప్పుడప్పుడు పైకి వస్తున్నాయని ఈ వైరుధ్యం సూచిస్తోంది. విదేశాంగ విధాన విషయాలపై రాజకీయ కూటమి తీవ్రంగా విభజించబడిన వైట్ హౌస్‌కు ఇది ఒక సవాలుగా మారుతున్నది. రూబియో, వాన్స్ ఇద్దరూ 2028 అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఉన్నవారిగా కనిపిస్తుండటంతో, ఇది రిపబ్లికన్ పార్టీ భవిష్యత్తుపై ఒక ముందస్తు సూచనను కూడా అందిస్తోంది.
జూన్ 17న వాషింగ్టన్, టెహ్రాన్‌ల మధ్య కుదిరిన ప్రాథమిక శాంతి ఒప్పందాన్ని సమర్థించేందుకు వాన్స్, రూబియో గతవారం విదేశాల పర్యటనలకు వెళ్లారు.
వాన్స్ ఇరాన్ అధికారులతో చర్చల కోసం స్విట్జర్లాండ్‌కు వెళ్లారు. విలేకరులతో మాట్లాడుతూ.. ఇరాన్‌తో చర్చల స్థితిపై నిశ్చయంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరాన్ పునర్నిర్మాణానికి గల్ఫ్ దేశాలు నిధులు సమకూర్చగలవని కూడా ఆయన ఇటీవలి వారాల్లో పదేపదే చెప్పారు. ఇరాన్, అమెరికా మధ్య మరింత సహకార సంబంధం ఏర్పడే అవకాశం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. గురువారం విడుదలైన ఒక ఇంటర్వ్యూలో, ఖతార్‌లోని పెంటగాన్‌తో ఘర్షణ నివారణ సంధానకర్తగా పనిచేయడా నికి అమెరికా ఒక ఇరాన్ గూఢచార అధికారిని ఆహ్వానించినట్టు వెల్లడించారు.
ఇదిలా ఉండగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, బహ్రెయిన్‌లలో రూబియో పర్యటించి, తమ మిత్రదేశాలకు భరోసా ఇచ్చారు. అమెరికా-ఇరాన్ తాత్కాలిక ఒప్పందం టెహ్రాన్‌కు చాలా ఉదారంగా ఉందని ఆందోళన చెందు తున్న కొన్ని మిత్రదేశాలకు వారి ప్రయోజనాలలకు ఏ ఇబ్బందీ ఉండదని ఆయన హామీఇచ్చారు. తన పర్యటనలో ఇరాన్ పునర్నిర్మాణానికి నిధులు సమకూర్చ మని గల్ఫ్ మిత్రదేశాలను అడగబోనని, అలాంటి అవకాశం సమీప భవిష్యత్ లో ఉండదని రూబియో అన్నారు. గురువారం ప్రాంతీయ అధికారులతో జరిగిన సమావేశం లో, అమెరికా, దాని మిత్రదేశాల ప్రయోజనాలకు సంబంధించి ఏ ఒప్పందమైనా పటిష్టంగా ఉండాలని ఆయన నొక్కిచెప్పారు.

దాచి పెడుతున్నారు.. వాటిని నమ్మం
అమెరికన్ ఎంటర్‌ప్రైజ్ ఇన్‌స్టిట్యూట్ థింక్ ట్యాంక్‌లో సీనియర్ ఫెలో అయిన మైఖేల్ రూబిన్, రూబియో , వాన్స్‌లు స్పష్టంగా భిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉన్నారని అన్నారు. “వారి మూలాలు వేర్వేరు ధోరణులకు చెందినవి,” అని ఆయన చెప్పారు. ఈ ఇద్దరు అధికారులు పూర్తిగా భిన్నమైన విదేశాంగ విధాన నేపథ్యాల నుంచి వచ్చారు. గత ఏడాది పదవీ బాధ్యతలు స్వీకరించడానికి ముందు, వాన్స్ విదేశీ యుద్ధాలు ప్రాణాలను, డబ్బును వృధా చేస్తాయని తరచుగా విమర్శించేవారు. రూబియో సెనేట్‌లో “హాక్” (తీవ్రవాది)గా పేరు తెచ్చుకున్నారు, అక్కడ ఆయన ఇరాన్, రషడాద, క్యూబాల పట్ల మరింత ఘర్షణ వైఖరిని ప్రోత్సహించారు. ఈ ఇద్దరినీ ట్రంప్‌నకు సంభావ్య వారసులుగా, రిపబ్లికన్ పార్టీలోని శక్తివంతమైన, పోటీపడే వర్గాల ప్రతినిధులుగా ప్రస్తావిస్తున్నారు. ఒకవైపు “నియోకన్సర్వేటివ్‌లు” ఉన్నారు, వీరి అనుచరులు విదేశీ జోక్యాన్ని సమర్థించే అవకాశం ఎక్కువగా ఉంది. మరోవైపు, ఇటీవలి అనేక విదేశీ యుద్ధాలు ఖరీదైనవి, నిర్లక్ష్యపూరితమైనవని వాదించే రిపబ్లికన్ ఓటర్లు, విధాన నిపుణులు ఉన్నారు.
రాయిటర్స్/ ఇప్సోస్ పోల్ ప్రకారం, ప్రస్తుత సంఘర్షణ అమెరికాను మరింత బలమైన స్థితిలో ఉంచిం దని కేవలం 52శాతం మంది రిపబ్లికన్లు మాత్రమే విశ్వసి స్తున్నారు. ఇది ఆ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయిందని సూచిస్తోంది.

‘అధ్యక్షుడు ట్రంప్‌నకు పూర్తి మద్దతు’
ఈ ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని వైట్ హౌస్ గట్టిగా ఖండించింది. “ఒకే ఒక వర్గం ఉంది – అది అధ్యక్షుడు ట్రంప్ వర్గం. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండకుండా చూసేందుకు అధ్యక్షుడు చేస్తున్న ప్రయత్నాలకు మొత్తం ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తోంది,” అని వైట్ హౌస్ ప్రతినిధి అన్నా కెల్లీ అన్నారు.
లెబనాన్ విషయంలో ఆ ఇద్దరు అధికారుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, తమ ప్రభుత్వం లక్ష్యం లెబనాన్ ప్రభుత్వ సార్వభౌమాధికారాన్ని దాని మొత్తం భూభాగంపై పునరుద్ధరించడమేనని మరో స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి టామీ పిగాట్ వాదించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -