Wednesday, March 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బొగ్గు లారీల దుమ్ముతో ఎగలేం.!

బొగ్గు లారీల దుమ్ముతో ఎగలేం.!

- Advertisement -

రోడ్డుపై ప్రజల ఆందోళన, నిరసన
నవతెలంగాణ – మల్హర్ రావు

మండల కేంద్రమైన తాడిచెర్ల నుంచి కొయ్యుర్ వరకు నిత్యం బొగ్గు లారీలతో రద్దీగా ఉండడంతో ఇండ్లు, వరి, పత్తి,మిర్చి పంటలపై దుమ్ము,దూళి చేరడంతో తాము ఎగలేకపోతున్నామని ప్రజలు వాపోతున్నారు. లారీలు వేగంగా వెళ్లడం ద్వారా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించడం జరుగుతుందని,రెండుమూడు రోజులకొక్కసారి మూగ జీవాలు ప్రమాదాలకు గురికావడం జరుగుతుందని మండలంలోని  మల్లారం, దబ్బగట్టు ప్రజలు బుధవారం రోడ్డుపై రోడ్డుపై బైఠాయించి,ఆందోళ, నిరసన చేపట్టారు.

దీంతో ట్రాఫిక్ జమై ప్రయాణికులు ఇబ్బందులకు గురైయ్యారు. బొగ్గు లారీలు పరిమితికి మించి బొగ్గు రవాణా చేయడంతో రోడ్డు ముక్కలై రోడ్డుపై ప్రయాణం చేయాలంటే నరకయాతన అనుభవిస్తున్నామని ప్రజలు వాపోతున్నారు. పరిమితికి మించి బొగ్గు రవాణా చేస్తున్న లారిలపై చర్యలు తీసుకోవాల్సిన ఆర్అండ్ బి అధికారులు అమ్యామ్యాలకు తలొగ్గి ఇటువైపు కన్నెత్తి చూడడం లేదని ప్రజలు మండిపడ్డారు. ఇప్పటికైనా సంబంధించిన ఉన్నతాధికారులు రోడ్డు నిర్మాణం చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా బొగ్గు రవాణా చేస్తున్న లారీలని సీజ్ చేయాలని,దుమ్ము,దూళి రాకుండా ఎప్పటికప్పుడూ జెన్కో అధికారులు చర్యలు తీసుకోవాలని లేదంటే లారీలను నిత్యం అడ్డుకోవడం జరుగుతుంది ప్రజలు హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -