చదువు మధ్యలో మానేసిన వారికి వరం..
ఓపెన్ టెన్త్, ఇంటర్ అడ్మిషన్లకు ఆహ్వానం..
ఈనెల 28 వరకు గడువు
నవతెలంగాణ – మల్హర్ రావు
చదువు మధ్యలో మానేసినవారికి ఓపెన్ స్కూల్ వరం లాంటిది.అలాంటి వారికి మళ్లీ చదువుకునే అవకాశం కల్పిస్తుంది. కొందరు వ్యక్తిగత,కుటుంబ పరిస్థితుల కారణాలతో పాఠశాల స్థాయిలోనే చదువు మధ్యలో ఆపేస్తారు. మరికొందరు పది పూర్తయ్యాక పలు కారణాలతో ఇంటర్ చదువకుండా మానేస్తుంటారు. అలాంటి వారు మళ్లీ చదువుకోవాలంటే తెలంగాణ స్టేట్ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) అవకాశం కల్పిస్తుంది. ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలకు ఉమ్మడి మెదక్ జిల్లాలో 2006-07 విద్యా సంవత్సరంలో ప్రవేశా లకు దరఖాస్తులు కోరుతున్నారు.ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 28 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.మండల కేంద్రమైన తాడిచెర్లలో ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ ఉంది.ఇందులో పదో తరగతి,ఇంటర్మీడియెట్ కోర్సుల్లో అభ్యర్థులు వృత్తి విద్యా కోర్సును ఆప్షన్గా సెలెక్ట్ చేసుకోవచ్చు.ఇంట ర్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ ఇతర కోర్సులుంటాయి.తెలుగు,ఇంగ్లిష్, భాషల్లో చదువుకోవచ్చు.
దరఖాస్తు ఇలా చేసుకోవాలి..
ఓపెన్ స్కూలులో పది ప్రవేశాలకు ఎలాంటి విద్యార్హత లేదు.కనీస వయసు 15ఏళ్లు.ఆపై వయసు గలవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.తహసీల్దార్ లేదా మున్సిపల్ అధికారులు జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రం ఉంటే పాఠశాల స్థాయిలో చదువు మానేస్తే ట్రాన్స్ ఫర్ సర్టిఫికెట్(టీసీ), ఆధార్ కార్డుతో ప్రవేశం పొందవచ్చు.మీరు ఇంటర్ లో ప్రవేశాలు పొందేవారు తప్పనిస రిగా టెన్త్ ఉత్తీర్ణత అవ్వాలి.ఆధార్ కార్డు, ఫోన్ నంబర్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు జత చేయాలి.ఈనెల 28వ తేదీ వరకు ప్రవేశాలకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా అడ్మిషన్లు పొందవచ్చు.
ఓపెన్ స్కూల్ ఫీజులు..
ఓపెన్ స్కూల్ పదిలో ప్రవేశాలకు ఫీజు ఓసీ అభ్యాసకులు రూ.1800,ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనారిటీ అభ్యాసకులు రూ.1400 చెల్లించాలి.ఇంటర్మీడియెట్లో అడ్మిషన్లకు ఓసీ అభ్యాసకులకు రూ.2300, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ అభ్యాసకులకు రూ. 2వేలు ఉంటుంది.ఫీజు ఆన్లైన్లో లేదా మీ సేవ కేంద్రాల ద్వారా లేదా అధ్యయన కేంద్రాల ద్వారా చెల్లించి ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రంలో దరఖాస్తు సమర్పించాలి.
సద్వినియోగం చేసుకోవాలి: సిహెచ్,తిరుపతి మండల కోఆర్డినేటర్
ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్లో అడ్మిషన్లు ఈనెల 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఈ విద్యకు రెగ్యులర్తో పాటు సమాన గుర్తింపు ఉంది.ఓపెన్ స్కూలులో పదోతరగతి పూర్తి చేసినవారు ఆపై విద్యకు,ఇంటర్ పూర్తి చేసిన వారు ఉన్నత విద్యకు కూడా అర్హులే.ఆసక్తి ఉన్న వారు అధ్యయన కేంద్రాలు,ఆన్లైన్లో తరఖాస్తు చేసుకోవాలి.



