- Advertisement -
నవతెలంగాణ-కుభీర్
మండల పరిధిలోని పార్డీ (బీ) రాజురా, జుమడా గ్రామాలలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను తహశీల్దార్ శ్రీదేవి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా తహహీల్దార్ మాట్లాడుతూ..ఎన్యూమరేషన్ ఫారాలు తప్పులు లేకుండా నింపి, బీఎల్ఓలకు ప్రజలు సహకరించాలని సూచించారు. అదేవిధంగా గడువులోగా ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ పూర్తి చేయాలని బీఎల్ఓలను ఆదేశించారు. ఆమె వెంట స్థానిక సర్పంచ్ లు మడి ప్రవీణ్, అగ్గు మారుతీ, ఆర్ ఐ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి, బి ఎల్ ఓ లు తదితరులు ఉన్నారు.
- Advertisement -



