Wednesday, July 15, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఏసీబీ వలలోమరో అవినీతి జలగ

ఏసీబీ వలలోమరో అవినీతి జలగ

- Advertisement -

అక్రమాస్తులు రూ. వంద కోట్లకు పైనే
హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్
రవీందర్ ఆస్తులపై కొనసాగుతున్న సోదాలు


నవతెలంగాణ ప్రత్యేక-ప్రతినిధి
ఏసీబీ అధికారులకు మరో అవినీతి జలగ చిక్కింది. హైదరాబాద్ మెట్రో‌పాలిటన్‌ డెవలప్‌‌మెంట్‌ అథారిటీ (‌హెచ్ఎండీఏ)చీఫ్ ఇంజినీర్‌ బి. రవీందర్ అక్రమాస్తులపై మంగళవారం ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ. వంద కోట్లకు పైనే ఆదాయానికి మించిన ఆస్తులున్నట్టు తేల్చారు. ఏసీబీ డైరెక్టర్ జనరల్ చారు సిన్హా తెలిపిన వివరాల ప్రకారం… హెచ్‌ఎండీఏ చీఫ్‌ ‌ఇంజినీర్‌ రవీందర్ అవినీతి అక్రమాలకు పాల్పడి కోట్లాది రూపాయల ఆస్తులను ఆర్జించినట్టు ఏసీబీకి సమచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ ప్రత్యేక టీమ్ లు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ని రవీందర్ కి చెందిన ఇల్లు, కార్యాలయం తో పాటు అతని బంధువులు, మిత్రులకు చెందిన 9 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కొండకల్, కిష్టాపూర్, పసమలలో రూ.38,89,700 లక్షల విలువైన 5 ఓపెన్ ప్లాట్లు, నానక్‌‌రాం గూడ , నార్సింగిలో రూ.2,07,40,000 కోట్ల విలువైన 4 నివాస ఫ్లాట్స్, కొత్తూరు మండలం గూడూరు గ్రామంలో రూ. 6 లక్షల విలువైన నాలుగెకరాల వ్యవసాయ భూమి, శంకరపల్లి మండలం మోకిల గ్రామంలో రూ.1,33,58,800 విలువైన విల్లాలను రవీంద్ర కలిగి ఉన్నట్టు గుర్తించారు.

అలాగే కొండాపూర్ లోని మస్జిద్ బండ వద్ద రూ .3 కోట్ల విలువైన 4 అంతస్తుల భవనం, నివాసంలో రూ.3,82,000 నగదు రూ.45 లక్షల బ్యాంకు బ్యాలన్స్, రూ.36,70,000 విలువైన కిలోన్నర బంగారు నగలు, రూ. 10,00,000 విలువైన వెండి నగలను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ.17 లక్షల విలువైన గృహోపకరణ వస్తువులు, రూ. 9,32,000 విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు, రూ.1,16,00,000 విలువైన ఇన్నోవా తదితర నాలుగు విలువైన కార్ లను కూడా ఏసీబీ అధికారులు సేజ్ చేశారు. ప్రాథమికంగా రవీందర్ కి చెందిన ఆస్తుల విలువ ను రూ.9,24,02,276 కోట్లు గా తేల్చిన అధికారులు బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.100 కోట్లకు పైగా నే ఉంటుందని అంచనా వేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు రవీందర్‌ ‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసు దర్యాప్తు సాగుతోందని, మరి కొన్ని చోట్ల సోదాలను కొనసాగిస్తామని వారు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -