Wednesday, July 15, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసమాచార్ భవన్ వద్ద టీడబ్ల్యూజేఎఫ్ భారీ ఆందోళన

సమాచార్ భవన్ వద్ద టీడబ్ల్యూజేఎఫ్ భారీ ఆందోళన

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) ఆందోళనకు పిలుపునిచ్చింది. బుధవారం హైదరాబాద్ లోని సమాచార పౌరసంబంధాల శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఎదుట శాంతియుత నిరసనకు భారీగా జర్నలిస్టులందరూ తరలి వచ్చారు. అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు, ఇండ్లస్థలాలు, హెల్త్ కార్డులను వెంటనే ఇవ్వాలని ఆ సంఘం రాష్ట్ర యాక్టింగ్ ప్రెసిడెంట్ పి రాంచందర్, ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒకే యూనియన్ కు చెందిన వాళ్లను అక్రిడిటేషన్ కమిటీల్లో నియమించడంతో నియంతృత్వం రాజ్యమేలుతోందన్నారు. ఏకపక్షంగా కార్డులు జారీచేస్తున్నారని ఆరోపించారు. గత 40 ఏండ్లుగా జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు ఇవ్వలేదని, వెంటనే ఆ ప్రక్రియ చేపట్టి త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -