నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తరప్రదేశ నోయిడాలో దారుణం జరిగింది. మురుగునీటి కాలువ శుభ్రం చేస్తుండగా మ్యాన్‌హోల్‌లో పడి ఒక పారిశుధ్య కార్మికుడు మృతి చెందాడు. నోయిడా అథారిటీ ప్రకారం, వాటర్ డివిజన్ III పరిధిలోని సెక్టార్-93బి మరియు గెఝా గ్రామం సమీపంలోని టి-పాయింట్ వద్ద లోతైన మురుగునీటి కాలువను శుభ్రం చేస్తుండగా మంగళవారం (జూలై 14) ఈ సంఘటన జరిగింది. మృతుడిని శివగా గుర్తించారు. అతను సేఫ్టీ బెల్ట్, ఆక్సిజన్ మాస్క్, ఇతర రక్షణ పరికరాలు ధరించి, మురుగునీటి మ్యాన్‌హోల్‌లోని అడ్డంకిని తొలగించే పనిలో నిమగ్నమై ఉన్నాడు. కొంతసేపటి తర్వాత క్షేత్రస్థాయి సిబ్బంది అతడిని బయటకు తీయడానికి ప్రయత్నించగా, అతను మ్యాన్‌హోల్‌లోని తీగలలో చిక్కుకుపోయాడని అథారిటీ తెలిపింది. స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయంతో వెంటనే సహాయక చర్యలు చేపట్టగా, అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించారు. తాజాగా నోయిడా అథారిటీ కాంట్రాక్టర్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, అధికారులపై క్రమశిక్షణా చర్యలు ప్రారంభించాలని ఆదేశించింది.
మ్యాన్‌హోల్‌లో పడి పారిశుధ్య కార్మికుడు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



