- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో నిరుద్యోగ యువత సమస్యలు, ఉద్యోగాల భర్తీ తదితర అంశాలను ప్రధాన అజెండాగా తీసుకొని బీఆర్ఎస్ పార్టీ సరూర్‌నగర్ స్టేడియంలో యువ సంగ్రామ సదస్సును నిర్వహించింది. ఈ సభకు మాజీ మంత్రి కేటీఆర్ భారీ కాన్వాయ్‌తో బయలుదేరగా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..యువత పిడికిలి బిగిస్తే పీఠాలే కదిలిపోతాయన్నారు. ఇప్పటివరకు ఒక లెక్క, ఇప్పటినుంచి మరో లెక్క అంటూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు.
- Advertisement -



