- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్‌చుక్‌ను ఢిల్లీ పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన నేపథ్యంలో, ఆయన భార్య గీతాంజలి జె.అంగ్మో కీలక వ్యాఖ్యలు చేశారు. తన అనుమతి లేకుండా సోనమ్‌కు ఎటువంటి వైద్య చికిత్స అందించకూడదన్నారు. తన అనుమతి లేకుండా చికిత్స ప్రారంభిస్తే, ఎదైనా జరిగితే అందరినీ బాధ్యులను చేస్తానని హెచ్చరించారు. సోనమ్ బాగానే ఉన్నారని, ఇప్పుడు ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. కాగా ప్రస్తుతం సోనమ్ సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో ఉన్నారు.
- Advertisement -



