Saturday, July 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులు రోజూ హాజరైయ్యేలా తల్లిదండ్రులు చూడాలి

విద్యార్థులు రోజూ హాజరైయ్యేలా తల్లిదండ్రులు చూడాలి

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల వెల్మలపల్లిలో మూతపడిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఇటీవల 2026-27 విద్యా సంవత్సరంలో గ్రామస్తులు,పూర్వ విద్యార్థులు విద్యాశాఖ అధికారులతో పునః ప్రారంభించారు. ఈ నేపథ్యంలో శనివారం ఇంఛార్జీ ప్రాధానోపాధ్యాయుడు సురేష్ తల్లిదండ్రులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ 24 మంది విద్యార్థులతో పాఠశాల పునః ప్రారంభమైనట్లుగా తెలిపారు. పాఠశాల లో విద్యార్థులు ప్రతి రోజు 95% హాజరవుతున్నారని తెలిపారు. వందశాతం అయ్యేలా..ఇంకా విద్యార్థుల సంఖ్య పెరుగెలా చూడాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి విద్యార్ధి ప్రతి రోజు హాజరు అయ్యేలా చూడాలని తల్లిదండ్రులకి సూచించారు. ప్రతి నెల మూడవ శనివారం ప్రతి తల్లిదండ్రులు సమావేశానికి రావాలని  కోరారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు గంగరాజు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -