Saturday, July 25, 2026
E-PAPER
Homeఖమ్మం'మిరాకిల్ మైండ్స్'  స్కూల్‌లో ఘనంగా ఇన్వెస్టిట్యూర్ సెర్మనీ

‘మిరాకిల్ మైండ్స్’  స్కూల్‌లో ఘనంగా ఇన్వెస్టిట్యూర్ సెర్మనీ

- Advertisement -

నవతెలంగాణ-సత్తుపల్లి 
సత్తుపల్లి పట్టణం సిద్ధారం రోడ్డులోని మిరాకిల్ మైండ్స్ పాఠశాలలో ఇన్వెస్టిట్యూర్ ఉత్సవాన్ని- ​2026-27 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థి నాయకుల బాధ్యతల స్వీకార మహోత్సవాన్ని ఘనంగా  నిర్వహించారు. ‘బాధ్యత, నిజాయితీతో కూడిన నాయకత్వం’ అనే ప్రధాన నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ పెంపొందించడమే దీని ముఖ్య ఉద్దేశమని ప్రిన్సిపాల్ మొండ్రు రత్నాకర్ తెలిపారు.

​నూతనంగా ఎంపికైన విద్యార్థి నాయకులకు పాఠశాల బ్యాడ్జీలు, పతకాలను అందజేసి బాధ్యతలు అప్పగించారు. ‘నడిపించండి, స్ఫూర్తినివ్వండి, సాధించండి’ అనే సూత్రాలతో ముందుకు సాగాలని ప్రిన్సిపాల్ విద్యార్థులకు  పిలుపునిచ్చారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు, జట్టు స్ఫూర్తిని పెంచేందుకు పాఠశాలలో 4 హౌస్‌లను ఏర్పాటు చేశారు. ఫీనిక్స్ పక్షి చిహ్నంతో ఎరుపు, సింహం చిహ్నంతో నీలం రంగు జెండాలను కేటాయించారు.

​గరుడ పక్షి చిహ్నంతో ఆకుపచ్చ, టార్చ్ చిహ్నంతో పసుపు రంగు జెండాలను రూపకల్పన చేశారు. నాయకుడు అంటే మార్గం తెలిసి, ఇతరులకు దారి చూపించేవాడని ప్రిన్సిపాల్ రత్నాకర్ విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. చిన్ననాటి నుంచే విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవడం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. ​పాఠశాల ప్రతిష్టను మరింత పెంచేలా విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని ఆకాంక్షించారు. నూతన బాధ్యతలు స్వీకరించిన విద్యార్థులను పాఠశాల యజమాన్యం, ఉపాధ్యాయులు అభినందించారు.

​ఈ కార్యక్రమంలో విద్యార్థుల ఉత్సాహం, వారి నాయకత్వ ప్రతిభ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఉపాధ్యాయులు, విద్యార్థుల సమక్షంలో ఈ వేడుక అత్యంత కోలాహలంగా ముగిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -