- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
డోంగ్లి మండలంలోని మల్లాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో గ్రామ శుభ్రత కార్యక్రమాన్ని ఆ గ్రామ సర్పంచ్ అమృత్వార్ శ్రీకాంత్ ఆదివారం చేపట్టారు. వర్షాకాలన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామంలో గల పిచ్చి మొక్కలను తొలగించారు. అదేవిధంగా గడ్డి మందును పిచికారి చేయించారు. వాడవాడల్లో ఈ కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
- Advertisement -



