నవతెలంగాణ-మద్నూర్
మండల కేంద్రంలోని రైతు వేదికలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆదివారం 53 కళ్యాణ లక్ష్మీ, 8 షాదీ ముబారక్ చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 15 ఏండ్లుగా ఉమ్మడి మద్నూర్ మండలం పూర్తిగా వెనుకబడిపోయిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్రంలో పాలన కొనసాగిస్తోందన్నారు. అదేవిధంగా మద్నూర్ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఇందులో భాగంగా మద్నూర్ తహశీల్దార్ నూతన భవన నిర్మాణానికి రూ. 25 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. దీంతో పాటు ఇందిరా నగర్ కాలనీలో డ్రైనేజీ నిర్మాణానికి రూ. 40 లక్షల నిధులు విడుదలైనట్టు చెప్పారు. భవిష్యత్తులో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నామినేషన్లు కూడా మద్నూర్ లో జరిగేవిధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. మండల స్థాయి నాయకులతో పాటు మద్నూర్ సర్పంచ్ ఉషా-సంతోష్ మేస్త్రీ కూడా గ్రామాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నారని గుర్తు చేశారు. ఆయన హయాంలో గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, టౌన్ అధ్యక్షులు గోపి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పరమేశ్ పటేల్, రాం పటేల్, శ్రీనివాస్ పటేల్, కొండ గంగాధర్, మైనార్టీ నాయకులు జావిద్ పటేల్, డోంగ్లి మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు బాచా లక్ష్మణ్, స్థానిక మండల నాయకులతోపాటు కాంగ్రెస్ కార్యకర్తలు, కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లబ్ధిదారులు పాల్గొన్నారు.
తహశీల్దార్ నూతన భవన నిర్మాణానికి రూ. 25 లక్షలు మంజూరు: ఎమ్మెల్యే తోట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



