Tuesday, July 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అధికారులు, సర్పంచులతో జెడ్పీసీఈఓ సమావేశం

అధికారులు, సర్పంచులతో జెడ్పీసీఈఓ సమావేశం

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్పంచులు, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, విబిజి రామ్ జీ సిబ్బందితో కామారెడ్డి జిల్లా ముఖ్య కార్య నిర్వహణ అధికారి చందర్ నాయక్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామాల అభివృద్ధిపై అధికారులు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. గ్రామాలలో శానిటేషన్ పనులు, పరిశుభ్రత, పాటించాలని సర్పంచులకు, కార్యదర్శులకు సూచించారు. అనంతరం ఖండేబల్లూర్ సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో బొర్ వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్ పనులను, ఇంకుడు గుంతలు, కమ్యునిటి సో ఫిట్స్, ఫామ్ ఫండ్ పనులకు మార్కౌట్ వేసి పనులు ప్రారంభించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఎమ్మార్వో మారుతి, మెడికల్ ఆఫీసర్ విఠల్, పిఓ రాము, ఎమ్ఈవో తిరుపతయ్య, పీఆర్ డీఈ మధు, ఏఈ శ్రీకాంత్, వ్యవసాయ శాఖ అధికారులు, ఏపీఓ వందేమాతరం, ముప్పై గ్రామ పంచాయతీల సర్పంచ్లు, కార్యదర్శిలు, బివి జి రామ్ జీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -