Thursday, March 26, 2026
E-PAPER
Homeఆదిలాబాద్గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది..

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది..

- Advertisement -

రాష్ట్ర జిసిసి చైర్మన్ కోట్నాక తిరుపతి

నవతెలంగాణ జన్నారం – దండేపల్లి:

గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి అన్నారు. గురువారం దండేపల్లి మండలంలోని లక్ష్మి కాంతపూర్ గ్రామపంచాయతీ లోని బిక్కన్ గూడ గ్రామంలోని ఆదివాసీ గూడెంలో 18 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బడుగు బలహీన వర్గాల పేద ప్రజలందరికీ అండగా నిలుస్తుంది అన్నారు. పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో లక్ష్మీకాంతపూర్ సర్పంచ్ మహేష్ ఉప సర్పంచ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజన్న , కాకో బాయి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ కుడ్మేత సోము, పుట్టపాక శ్రీనివాస్, కాశెట్టి శంకరయ్య, కొత్తపల్లి నర్సయ్య, తదితరులు ఈ కార్యక్రమం పాల్గొన్నారు.

















- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -