Saturday, April 18, 2026
E-PAPER
Homeఆటలుఐపీఎల్ రెండో దశ షెడ్యూల్ విడుద‌ల

ఐపీఎల్ రెండో దశ షెడ్యూల్ విడుద‌ల

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) గురువారం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 రెండో దశ షెడ్యూల్‌ను ప్రకటించింది. ప్లేఆఫ్స్ వేదికలను తరువాత ప్రకటిస్తామని బిసిసిఐ ధృవీకరించింది. 50 మ్యాచ్‌లతో కూడిన లీగ్ దశలోని మిగిలిన మ్యాచ్‌లు ఏప్రిల్ 13 నుండి మే 24 వరకు 12 వేదికలలో జరుగుతాయి. ఐపీఎల్ వెబ్‌సైట్ అధికారిక ప్రకటన ప్రకారం.. రెండో దశలోని మ్యాచ్‌లు బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్, లక్నో, జైపూర్, ధర్మశాల, రాయ్‌పూర్ మరియు న్యూ చండీగఢ్‌లలో జరుగుతాయి.

మార్చి 28 నుంచి ఏప్రిల్ 12 వరకు జరగనున్న ఐపీఎల్-2026 మొదటి దశ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించిన విష‌యం తెలిసిందే. తొలి మ్యాచ్ బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)తో తలపడ‌నున్నాయి. ఐపీఎల్ మొదటి దశలో 10 వేదికలలో మొత్తం 20 మ్యాచ్‌లు జరుగుతాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -