Saturday, April 18, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ఉపాధి కూలీల‌ ‌ముఖానికి పౌడర్..

ఉపాధి కూలీల‌ ‌ముఖానికి పౌడర్..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ఉపాధి కూలీలకు ముఖ చిత్రం గుర్తింపు తప్పనిసరి చేసింది. కానీ ముఖం గుర్తింపు రాక కూలీలు ఇంటికి తిరిగి వెళ్లుతున్నారు. అయితే కుమురం భీమ్ జిల్లాలో ముఖం గుర్తింపు పడకుండా ఇబ్బందులు తొలగించడానికి జైనూర్ మండలం జామిని గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ బాబు వినూత్నంగా ఆలోచించాడు. ముఖ చిత్రాలు పడని వారి ముఖాలకు టాల్కమ్ పౌడర్ వేస్తున్నారు. ముఖానికి పౌడర్ కొట్టడంతో సులువుగా సెల్ ఫోన్లో ముఖాల గుర్తింపు రికార్డు అవుతున్నాయి. ఈచిన్న ఉపాయంతో ఉపాధి కూలీలకు హజరు నమోదవుతుంది. ముఖ గుర్తింపు కోసం ఈ ఫీల్డ్ అసిస్టెంట్ చేసిన ఉపాయం బాగుందని అందరూ అభినందిస్తున్నారు. ఉపాధి హామీ పనుల్లో ఇకపై కూలీల హాజరును ఫేస్ అథెంటికేషన్‌ను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -