Saturday, April 18, 2026
E-PAPER
Homeతాజా వార్తలునేడు ఉప్పల్ లో ట్రాఫిక్ ఆంక్షలు..

నేడు ఉప్పల్ లో ట్రాఫిక్ ఆంక్షలు..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో ఈ నెల 18, 21, మే 3, 6, 22 తేదీల్లో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. నేటి మ్యాచ్ సందర్భంగా మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 12 గంటల వరకు ఈ ఆంక్షలు వర్తిస్తాయి. నాగోల్ నుంచి హబ్సిగూడ, బోడుప్పల్ నుంచి అంబర్‌పేట్ మార్గాల్లో వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్నందున ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సూచించారు. పాస్‌లు ఉన్న వాహనాలు మాత్రమే స్టేడియంలో పార్కింగ్ చేయాలని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -