Saturday, April 18, 2026
E-PAPER
Homeజాతీయంఆ బిల్లు ఆమోదం పొంద‌ద‌ని మోడీకి ముందే తెలుసు: ఎంపీ ప్రియాంకా గాంధీ

ఆ బిల్లు ఆమోదం పొంద‌ద‌ని మోడీకి ముందే తెలుసు: ఎంపీ ప్రియాంకా గాంధీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: మ‌హిళా రిజ‌ర్వేష‌న్‌పై మోడీ ప్ర‌భుత్వానికి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కీల‌క సూచ‌న చేశారు. 2023లో రూపొందించిన బిల్లును తిరిగి పార్ల‌మెంట్ ఉభ‌య‌స‌భ‌ల్లో ప్ర‌వేశ‌పెట్టాల‌న్నారు. చిన్న చిన్న స‌వ‌ర‌ణ‌ల‌తో ఆ బిల్లు ఏక‌గ్రీవంగా ఆమోదం పొందుతుంద‌ని ఢిల్లీ మీడియా స‌మావేశంలో చెప్పారు. బీజేపీ ఎలాంటి ఆల‌స్యం చేయ‌కుండా 2023 నాటి బిల్లును పార్ల‌మెంట్ ప్ర‌వేశ‌పెట్టాల‌న్నారు. శుక్ర‌వారం రోజు 131 రాజ్యాంగ స‌వ‌ర‌ణ వీగిపోయిన రోజు ఎన్డేయే కూట‌మి స‌ర్కార్‌కు బ్లాక్ డే అని, ప్ర‌తిప‌క్షాల ఐక్య‌మ‌త్యంతో రాజ్యాంగంపై దాడిని, బిల్లు వెనుకున్న కుట్ర‌ల‌ను అడ్డుకున్నాయ‌ని కొనియాడారు.

నేడు మహిళల సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. మహిళలు మూర్ఖులు కాదు. వారు ప్రతిదీ గమనిస్తారు. ఆ పీఆర్, మీడియా హడావిడి ఇకపై పనిచేయవు.” ప్రతిపక్షాల వైఖరి మహిళా రిజర్వేషన్‌కు వ్యతిరేకం కాదని, అయితే దానిని డీలిమిటేషన్, జనగణన ప్రక్రియలతో ముడిపెట్టడానికి వ్యతిరేకమని ప్రియాంక గాంధీ పునరుద్ఘాటించారు. నిన్న ప్ర‌జాస్వామ్యానికి అతి పెద్ద విక్ట‌రీ అని, స‌మాఖ్య వాదాన్ని బ‌ల‌హీన ప‌ర్చాల‌ని కుట్ర‌లు చేశార‌ని, కానీ తామంత వారి చ‌ర్య‌ల‌ను అడ్డుకొని, వారిని ఓడించామ‌న్నారు.

“ఇది రాజ్యాంగానికి లభించిన విజయం, దేశానికి లభించిన విజయం, ప్రతిపక్ష ఐక్యతకు లభించిన విజయం,” అని ఆమె అన్నారు. వారు(బీజేపీ) ఈ బిల్లును తీసుకువచ్చిన తీరు, దానికి జతచేసిన నియోజకవర్గాల పునర్విభజన, 2011 జనాభా లెక్కలు వంటివి చూస్తే, ఈ బిల్లు ఆమోదం పొందదని వారికి ముందే తెలుసన్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. వారు కేవలం రాజకీయ ఖ్యాతిని మాత్రమే కోరుకున్నారని ఆమె పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -