Saturday, April 18, 2026
E-PAPER
Homeక్రైమ్బాలుడి ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

బాలుడి ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఆ కాలనీలో నివసిస్తున్న లక్ష్మీకి ఇద్దరు శ్రావణ్ (5), సమీరా (8) పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాల కారణంగా భర్తతో వేరుగా ఉంటోంది. అయితే గత ఆరు నెలలుగా లక్ష్మీ నరసింహులు అనే వ్యక్తితో కలిసి సహజీవనం చేస్తుంది. ఈ క్రమంలో లక్ష్మీ పనిమీద బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఉన్న ఐదేళ్ల బాలుడు శ్రావణ్‌పై నరసింహులు దారుణంగా దాడి చేశాడు. బాలుడి గొంతు పిసికి, నోరూ ముక్కూ మూసి, నేలకేసి కొట్టి హత్య చేసినట్లు రాజంపేట గ్రామానికి చెందిన లక్ష్మీ బాబాయి రమేష్ తెలిపారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -