Saturday, April 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎండలోనే ఉపాధి కూలీలు పనులు.!

ఎండలోనే ఉపాధి కూలీలు పనులు.!

- Advertisement -

హాజరు కారణంగా ఆలస్యం
ఇబ్బంది పడుతున్న కూలీలు
నవతెలంగాణ – మల్హర్ రావు

రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. వడగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 11 గంటల నుంచే ఎండలు దంచికొడు తున్నాయి. అయితే ఉపాధి కూలీలు ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు జాగ్రత్తలు తీసుకోవా అని వైద్యులు సూచిస్తున్నారు. మండలంలో మొత్తం జాబ్ కార్డులు 8,495,మొత్తం కూలీలు 18,873,యాక్టివ్ కూలీలు 1,0632,ప్రస్తుతం కూలికి హాజరవుతున్న కూలీలు 735 మాత్రమే.

పనుల సమయంలో..
ఉపాధిహామీ 100 రోజుల పనికి గ్రామీణా ప్రాంతంలో తక్కువ సంఖ్యలో కూలీలు పనికి హాజరవుతు న్నారు. ఈ ఏడాది పనులు ఏప్రిల్ మొదటి వారం నుంచే ప్రారంభం అయ్యాయి. ప్రతీ జాబ్ కార్డుకువంద రోజుల పని ఉంటుంది. ఉదయం పూట ఉపాధిలో ఉన్న వివిధ పనులకు వెళ్తుంటారు.కానీ తిరిగి వచ్చే సరికి మధ్యాహ్నం అవుతుంది. ఈ ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో కూలీలు ఉక్కి రిబిక్కిరి అవుతున్నారు.

అధికారుల అవగాహన..
ఇటీవల రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఉపాధి కూలీల గురించి మాట్లాడారు. కూలీలు ఉదయం పూటనే పనులు త్వరగా ముగించుకోవాలని సూచించారు.మండల ఎంపిడిఓ శ్రీరామూర్తి,ఉపాధిహామీ ఎపిఓ హరీష్ మండలంలో పలు గ్రామాల్లో కొనసాగుతున్న ఉపాధి పనులను పరిశీలిస్తూ ఉపాధి కూలీలకు అవగాహన కల్పిస్తున్నారు.

హాజరు ఆలస్యం..
ఈ ఏడాది ప్రవేశపెట్టిన ఎన్ఎంఎస్ఎస్ యాప్లో కూలీల హాజరు రెండుసార్లు నమోదు చేయాలి. ఉదయం హాజరు నమోదు చేసిన నాలుగు గంటల తర్వాత సాయంత్రం మళ్లీ హాజరు తీసుకుంటుంది. అలాగే యాప్ పని చేసేందుకు మొబైల్ సిగ్నల్ అవసరం. అనేక గ్రామాల్లో సిగ్నల్ సమస్యతో కూలీలు ఇబ్బంది పడుతున్నారు.

సమయం తగ్గించాలి..
ప్రతీరోజు ఉపాధిహామీ పథకం పనులకు హాజరవుతున్నామని కూలీలు తెలిపారు.కొత్తగా వచ్చిన హాజరు యాప్ ద్వారా రెండుసార్లు హాజరు నమోదు చేసుకుంటు న్నారు.కానీ ఉదయం, సాయంత్రం హాజరుకు నాలుగు గంటలు ఆగాల్సి వస్తోంది. దీంతో ఎండ పెరిగిపోతోంది.హాజరు సమయాన్ని తగ్గించాలని కూలీలు కోరుతున్నారు.

ఉదయమే పనులు చేయాలి: గిరి హరీష్….ఉపాధిహామీ ఎపిఓ 
మండలంలో అన్ని గ్రామాల్లో ఉపాధిహామీ పనులను ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఉదయం పూటనే పనులు చేయాలని కూలీలకు సూచించాం. ఉపాధి పనులకు వచ్చే కూలీలు కూడా జాగ్రత్తలు పాటించాలి. హాజరు కాలవ్యవధిపై అధికారులకు వివరించాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -