నవతెలంగాణ – మద్నూర్
జనగణన మొదటి దశలో భాగంగా అధికారులు ఎన్యూమరేటర్స్ కు శిక్షణా తరగతులు మద్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల (బాలుర)లో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జనగణనలో ఎన్యూమరేటర్స్ పాత్ర కీలకం అని, గృహ గణన, గృహ జాబితా తయారు చేయడం చాలా ముఖ్యమైన మొదటి కర్తవ్యమని తెలిపారు. ఆ ప్రక్రియను పకడ్బందీగా, తప్పులు లేకుండా చేయాలని అన్నారు. మొదటిసారిగా పేపర్ వాడకుండా మొబైల్ యాప్ ద్వారానే జనగణన జరుగుతుందని వారు వెల్లడించారు.
సహాయ జనగణన మండల అధికారిణి, ఎంపీడీవో రాణి మాట్లాడుతూ.. గ్రామాలలో ఇండ్ల జాబితా, గ్రామ వివరాలు నమోదు చేయడంలో కార్యదర్శులు సహకరిస్తారని తెలిపారు. వారి సహకారంతో తప్పులు లేకుండా జనాభా లెక్కలు తయారు చేయాలని సూచించారు. మొదటి దశలో ఈ క్రింది విధంగా వివరాలు నమోదు చేస్తారు.
ఇండ్ల జాబితా..
ప్రాంతంలో ఉన్న అన్ని ఇండ్లను గుర్తించి, వాటి వివరాలు నమోదు చేయడం.
ఇండ్ల గణన..
ఇళ్ల సంఖ్య, నిర్మాణం, సౌకర్యాలు (నీరు, విద్యుత్, మరుగుదొడ్డి మొదలైనవి) గురించి సమాచారం సేకరించడం. ఈ శిక్షణా శిబిరంలో మండల ఏ ఎస్ ఓ దత్తు, గిర్దావర్ శంకర్, సిబ్బంది రవి, మాస్టర్ ట్రైనర్ లు పాల్గొన్నారు.



