Saturday, April 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళా హక్కులపై ప్రతిపక్షాలకు గొడ్డలిపెట్టు

మహిళా హక్కులపై ప్రతిపక్షాలకు గొడ్డలిపెట్టు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మహిళా సాధికారత గురించి వేదికల మీద గంభీర ఉపన్యాసాలు ఇచ్చే కాంగ్రెస్ పార్టీ ‘ఇండియా’ కూటమి నాయకులకు పార్లమెంటు సాక్షిగా మహిళా శక్తి వందన అధినియం బిల్లు పట్ల మీ వైఖరి చూస్తుంటే ‘ఇండియా’ కూటమి కాదు, ఒక మహిళా వ్యతిరేక కూటమని స్పష్టమవుతోందని మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు బండ శ్రీకాంత్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.దేశ జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ తీసుకున్న చారిత్రక నిర్ణయాన్ని అడ్డుకోవడం అక్షరాలా మహిళలకు చేసిన ద్రోహం.

విపక్షాల మొండి వైఖరి వల్ల దేశ మహిళలు తమ హక్కులను కోల్పోయారని తెలిపారు. మహిళా శక్తికి అడ్డుకట్ట వేయాలని చూస్తున్న ప్రతిపక్షాలకు, కాంగ్రెస్ కూటమికి రాబోయే 2029 ఎన్నికల్లో దేశంలోని ప్రతి ఆడబిడ్డ తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -