Saturday, April 18, 2026
E-PAPER
Homeఆటలుఉప్ప‌ల్ వేదిక‌గా ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్..హైద‌రాబాద్‌లో మారిన వాతావ‌ర‌ణం

ఉప్ప‌ల్ వేదిక‌గా ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్..హైద‌రాబాద్‌లో మారిన వాతావ‌ర‌ణం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఉద‌యం నుంచి హైద‌రాబాద్‌లో ఎండ‌లు దంచికొట్ట‌గా..సాయంత్రం ఒక్క‌సారిగా వాతావర‌ణం మారిపోయింది. న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షం ప‌డింది. కాసేప‌ట్లో ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్, చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్ల‌ మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. దీంతో ఎస్ఆర్‌హెచ్, సీఎస్క్‌ల మ్యాచ్‌కు వాన ముప్పు పొంచి ఉంది. ఇప్ప‌టికే స్డేడియం వ‌ద్ద‌కు ఇరు జ‌ట్ల అభిమానులు ఉల్లాసంగా త‌ర‌లివ‌స్తున్నారు. త‌మ ఫేవ‌రేట్ల ఆట‌గాళ్ల ఆట‌ను ఆస్వాదించాల‌ని ఉవ్విళ్లువురుతున్నారు. అయితే ఒక్క‌సారిగా హైద‌రాబాద్‌లో మారిన వాతావ‌ర‌ణంతో అభిమానుల్లో ఆందోళ‌న నెల‌కొంది. ఆట ప్రారంభం కాక ముందే వానా వ‌స్తుందా, లేక ఆట మ‌ధ్య‌లో మ్యాచ్‌కు అంత‌రాయం క‌లిగిస్తుందా అని దిగులు చెందుతున్నారు.

పాయింట్ల ప‌ట్టిక‌లో ఎస్ఆర్‌హెచ్(4) ఐదో స్థానంలో ఉన్నంది. టోర్నీలో ఐదు మ్యాచ్‌లు ఆడి రెండు గెలిచి, మూడు ఓడిపోయింది. సీఎస్క్ చివ‌రి నుంచి మూడు స్థానంలో ఉంది. ఐదు మ్యాచ్‌లు ఆడి నాలుగు ఓడిపోయింది, కేవ‌లం ఒక్క విజ‌యం న‌మోదు చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -