నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్రంలోని రైతన్నలకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రెండో విడత రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 20న సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఈ వేదిక నుంచే కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నేరుగా నిధులను జమ చేయనున్నారు. రెండో విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 45,11,947 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఈ విడతలో మొత్తం రూ.5,653 కోట్ల నిధులను ప్రభుత్వం రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి బదిలీ చేయనుంది. అయితే, సాగు సమయానికి పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేస్తోంది. ఇప్పటికే రుణమాఫీ ప్రక్రియను వేగవంతం చేసిన సర్కార్, ఇప్పుడు రైతు భరోసా నిధులను కూడా విడుదల చేస్తుండటంతో రైతన్నల్లో హర్షం వ్యక్తమవుతోంది.
రైతన్నలకు గుడ్‌న్యూస్..ఖాతాల్లోకి నగదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



