నవతెలంగాణ-హైదరాబాద్ : డివైఎఫ్ఐ హైదరాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో మెట్రో స్టేషన్లలో పార్కింగ్ ప్రాంతాల్లో షెడ్స్ ఏర్పాటు చేయాలని మెట్రో ఎండీ సర్ఫరాజ్ అహ్మద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా డివైఎఫ్ఐ నగర కార్యదర్శి జావీద్, నగర ఉపాధ్యక్షులు రాజయ్య మాట్లాడుతు హైదరాబాద్ నగరంలో మెట్రో సేవలను ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులు వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెట్రో స్టేషన్ల వద్ద ఉన్న పార్కింగ్ సౌకర్యాలు ప్రయాణికులకు అత్యంత కీలకంగా మారాయి. ప్రస్తుతం నగరంలోని దాదాపు 66 మెట్రో స్టేషన్లలో పార్కింగ్ ప్రాంతాల్లో సరైన షెడ్స్ లేకపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పెయిడ్ పార్కింగ్ ఉన్నప్పటికీ, వాహనాలకు తగిన రక్షణ లేకపోవడం ఆందోళనకర విషయం.
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రతలు 43డిగ్రీల వరకు నమోదవుతున్న నేపథ్యంలో ద్విచక్ర వాహనాలు ఎండలో నిలిపివేయడం వల్ల ఫైర్ ప్రమాదాలు, పంచర్ సమస్యలు వంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనివల్ల ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు, మెట్రో ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని, అన్ని మెట్రో స్టేషన్ల పార్కింగ్ ప్రాంతాల్లో తక్షణమే షెడ్స్ ఏర్పాటు చేయాలని మనవి చేశారు. ఈ అంశంపై వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.
మెట్రో స్టేషన్ పార్కింగ్ ల్లో షెడ్స్ ఏర్పాటు చేయాలి : డివైఎఫ్ఐ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



