Saturday, April 18, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఏపీ సీఎంపై తెలంగాణ ముఖ్య‌మంత్రి సెటైర్లు

ఏపీ సీఎంపై తెలంగాణ ముఖ్య‌మంత్రి సెటైర్లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఏపీ సీఎం చంద్ర‌బాబుపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు.నితీశ్ కుమార్, ఏక్ నాథ్ షిండేల తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు పరిస్థితి ఉంటుంద‌న్నారు. ప్రస్తుతం బీజేపీకి కేంద్రంలో సీట్లు తక్కువగా ఉండటంతో.. టీడీపీకి ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు. శనివారం ఢిల్లీలో మీడియాతో సీఎం చిట్‌చాట్ చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీల మనుగడ భవిష్యత్తులో కష్టంగా ఉంటుంద‌న్నారు. 2/3 మెజార్టీ వచ్చినంత మాత్రాన అన్నింటిని చట్టాలు చేయలేమని పేర్కొన్నారు. కేంద్రంలో మెజార్టీ ఉందని ప్రధానిగా ఉన్న ఎవరైనా తనకు తాను రాజుగా 2/ 3వ వంతు మెజార్టీతో చట్టం చేసుకుంటే ఎవరూ ఒప్పుకోరు కదా అని ప్రశ్నించారు. డిక్టేటర్‌షిప్‌ని ఎవరు ఒప్పుకోరని చెప్పారు. ఏపీలో ప్రతిపక్షానికి కేవలం 11 సీట్లే ఉన్నాయని తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళలకు కేంద్రం రిజర్వేషన్ కల్పించాలని సీఎం రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -