ప్రధానోపాధ్యాయులు తారా సింగ్
నవతెలంగాణ – మిడ్జిల్
ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య, అనుభవాగ్నులైన ఉపాధ్యాయులు ఉన్నారని, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా, ప్రభుత్వము పాఠశాలలను బలోపేతం చేస్తుందని, ప్రధానోపాధ్యాయులు తారా సింగ్ విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పారు. శనివారం మండలంలోని దోనూర్ పాఠశాల ఉపాధ్యాయులు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చర్చాలని కోరారు. ఒకటో తరగతి నుండి 5వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఉచితంగా పాఠ్యపుస్తకాలు, రెండు జతల ఏకరూప దుస్తులు, ప్రభుత్వము అందిస్తుందని తెలిపారు. గ్రామంలో ఉన్న విద్యార్థులంతా ప్రభుత్వ పాఠశాలలో చేరేవిధంగా యువజన సంఘాలు, ప్రజాప్రతినిధులు, యువకులు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు లక్ష్మయ్య, కృష్ణా నాయక్, అంజలి విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



