Saturday, April 18, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ప్రజల దాహార్తి తీర్చేందుకే చలివేంద్రాలు 

ప్రజల దాహార్తి తీర్చేందుకే చలివేంద్రాలు 

- Advertisement -

సర్పంచ్ కందురు సాయినాథ్..
నవతెలంగాణ – కుభీర్
వేసవికాలం దృష్టిలో ఉంచుకొని ప్రజలకు నీటి సమస్య ఏర్పడకుండా ఉండేందుకు గ్రామంలో చలివేంద్ర కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని స్థానిక సర్పంచ్ కందరు సాయినాథ్ అన్నారు. శనివారం మండల కేంద్రమైన కుబీర్ లోని బస్టాండ్ సమీపంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్ర కేంద్రాన్ని మండల ఎంపీడీవో స్థానిక సర్పంచ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి కాలంలో  వివిధ గ్రామాల నుంచి మండల కేంద్రానికి వచ్చే ప్రజలు నీటి కోసం అల్లాడుతూ ఉండకుండా ఉండేందుకు ఈ చలివేంద్ర కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో వివిధ గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు దాహార్తి తీర్చుకొని అత్యవసర సమయాల్లోని బయటకు వెళ్లాలని వారు సూచించారు. అదేవిధంగా మండలంలోని ఆయా గ్రామాల్లో ఉన్న సర్పంచులు నాయకులు ఇలాంటి చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేసుకొని ప్రజలకు మేలు కలిగించే విధంగా ఉంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాయినాథ్ ఉపసర్పంచ్ గంగాధర్ పంచాయతీ ఈవో జాదవ్ మాధవ్. వార్డు సభ్యులు గ్రామస్తులు ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -