నవతెలంగాణ – పెద్దవంగర
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పెద్దవంగర పోలీస్ స్టేషన్ రైటర్ సుంకరి ప్రశాంత్ కు ఉత్తమ ప్రశంసా అవార్డు లభించింది. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో స్టేషన్ రైటర్ గా విధులు నిర్వర్తిస్తూ ఉత్తమ సేవలు అందించినందుకు ఈ గౌరవం దక్కింది. ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీశ్, జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో, బాధ్యతాయుతంగా సేవలందించినందుకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బంది, బంధువులు, స్నేహితులు అభినందించారు. ఆయనతో పాటుగా వడ్డెకొత్తపల్లి ఆయుర్వేదిక్ వైద్యశాల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రవి కుమార్, ఉత్తమ పశు వైద్యాధికారి గా డాక్టర్ రాజశేఖర్ లు ప్రశంసా పత్రాలు అందుకున్నారు.
రైటర్ సుంకరి ప్రశాంత్ కు ఉత్తమ ప్రశంసా అవార్డు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



